ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు..

పాపన్న నిరుపేదలు, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు: తుంగతుర్తి రవి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు..

ఉప్పల్ డిపో ముందు ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు హాజరై వారికి పూలు వేసి నివాళి అర్పించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ... బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావున్ని స్మరించుకుంటున్నాము. సర్దార్ పాపన్న సాహసంతో, ధైర్యంతో నిండిన పోరాట యోధుడుగా, సామాజిక న్యాయం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి, తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటం అక్షయంగా నిలిచిపోతుంది.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

ఆయన చేసిన సాహసాలు, తెగువ, నాయకత్వం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. తాను సమానత్వం, సత్యం, ధర్మం కోసం చేసిన కృషి నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది అని, "సర్దార్ పాపన్న అన్యాయానికి, ఆచారం పేరుతో జరుగుతున్న అణచివేతకు ఎదురు నిలిచి, న్యాయం, సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడు. ఆయన చేసిన సేవలు, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పాపన్న నిరుపేదలు, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. ఆయన ఆశయాలను కొనసాగించటం మన అందరి బాధ్యత," అని పేర్కొన్నారు. 

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన కీర్తిని స్మరించుకుంటూ, తుంగతుర్తి రవి ఆయన ఆశయాలను కొనసాగించడం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కుంటుపడిన విద్యా వ్యవస్థ

ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, కార్పొరేటర్లు దేవేందర్ గౌడ్, లీగల్ సెల్ అధ్యక్షులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వేముల నాదం గౌడ్, బృందాకర్ గౌడ్, కొంపల్లి వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, శారదా గౌడ్, నందిత గౌడ్, దంతురి వెంకట్ గౌడ్, సోమేశ్ గౌడ్, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More MPDO వెంకన్న అధ్యక్షతన అవగాహన సమావేశం

Views: 6