Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త..

జూన్ నెలాఖరు వరకు అవకాశం, సిద్ధంగా ఉండండి

Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త..

తెలంగాణ పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. జూన్ నెలాఖరు వరకు రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సీజన్‌లో 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో ధాన్యం సేకరణ
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగా.. జూన్ నెలాఖరు వరకు మూడు నెలలకోసారి కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. రబీ సీజన్‌లో 75.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లాలు, నెలల వారీగా కొనుగోలు చేయాల్సిన ధాన్యం అంచనాలను సిద్ధం చేశారు.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

మే నెలలో బియ్యం పెద్దఎత్తున వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో మొత్తం లక్ష్యంలో దాదాపు 57 శాతం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ఏప్రిల్‌లో 19,20,846 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మేలో 42,83,558 టన్నులు, జూన్‌లో 13,36,461 టన్నులు లక్ష్యంగా నిర్ణయించారు.

Read More Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

paddy

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో రైతులు కోతలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వరి కోతలు కొనసాగుతున్నాయి. మార్చి మొదటి వారంలో నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. జగిత్యాల, జనగామ, నిర్మల్ జిల్లాల్లో రెండు, మూడో వారం నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వరంగల్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. మిగిలిన జిల్లాల్లో మూడు, నాలుగో వారాల్లో కోతలు ప్రారంభం కానున్నాయి.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

రాష్ట్రవ్యాప్తంగా 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం కాగా సోమవారం నాటికి 5,923 కేంద్రాలు ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన కేంద్రాలను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్లతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

Views: 0