Farmers : రైతులకు మద్దతు ధర దక్కడంలేదు
ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వక పోగా మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదు. రైతులు క్వింటాల్ కు 1500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు.
జయభేరి, హైదరాబాద్ :
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి మీడియతో మాట్లాడారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వక పోగా మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదు. రైతులు క్వింటాల్ కు 1500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. జనగామ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 193 అయితే కొనుగోలు చేసింది 440 మెట్రిక్ టన్నులు మాత్రమే. మార్కెట్ యార్డ్ కు 4వేల మెట్రిక్ టన్నులు వచ్చింది.. అక్కడ కేవలం 1530 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.. మద్దతు ధరకు 700 రూపాయలకు తక్కువగా వ్యాపారులు దళారులు కొంటున్నారు. రైతులతో కలిసి అధికారులను నిలదీస్తే మొదట తక్కువ ధరకు కొనడం లేదని అధికారులు బుకాయించారు. వ్యవహారం సీఎం దాకా వెళ్లినా రైతులకు అదనంగా లభించింది 30 రూపాయలు మాత్రమే.
ఇప్పటికే వడ్లను తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు నష్ట పోయిన మొత్తాన్ని వారి అకౌంట్లలో వేయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పినట్టు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ చెల్లించాలి. సీఎం రేవంత్ జనగామ ఘటన పై అధికారులను ప్రశంసిస్తున్నారు ..కేవలం 30 రూపాయలు పెంచి 1560 రూపాయలకు వడ్లను కొన్నందుకు సీఎం వారిని ప్రశంసిస్తున్నారా ? సీఎం ఆదేశాల తర్వాత కూడా రైతులు 700 రూపాయలు క్వింటాల్ కు నష్టపోతున్నారని అన్నారు.
Post Comment