Dammaiguda municipality I గట్టిగా దున్నుకో.. ఎంచక్కా ఎనకేసుకో.. టీపివో.. సెక్షన్ అసిస్టెంట్ నో డౌట్..!

అంత కరప్షన్ కింగులే.. మున్సిపాలిటీ కమిషనర్!? టీపీవో శ్రీధర్, అసిస్టెంట్ భువనేశ్వర్ కనుసనల్లో ఆక్రమ అనుమతులు!? ఊరు ఒకరిది.. పేరు ఒకరిది అనేలా ఉంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ తీరు... కలెక్టర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పై ప్రత్యేక చొరవ తీసుకొండి సార్..!

Dammaiguda municipality I గట్టిగా దున్నుకో.. ఎంచక్కా ఎనకేసుకో.. టీపివో.. సెక్షన్ అసిస్టెంట్ నో డౌట్..!

జయభేరి, దమ్మైగూడ :

దమ్మైగూడ మున్సిపాలిటీలో యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మునిసిపల్ కమిషనర్ కొనుక్కు నిద్రపోతూ నటనలో గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కేల నటిస్తున్నాడు. ఇక వివరాల్లోకెళితే.... మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జోరుగా ఆక్రమ అనుమతులకు తేర లెపాడు టీపీవో అతని అసిస్టెంట్ భువనేశ్వర్. దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో ఫేస్ 2 ఫేస్ 3 లోని సర్వేనెంబర్ 406, 407, 408, 386 అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉండగా, అట్టి పార్క్ స్థలం లో దొంగ ఆక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఇంటి నిర్మాణం కోసం దమ్మాయిగూడ మునిసిపల్ లో ఆక్రమ అనుమతులు పొంది యదేచ్చగా నిర్మాణపనులు కొనసాగిస్తున్నారు.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం.. 

ఈ తాతంగం మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియకుండా టీపీవో అధికారి శ్రీధర్, అతని అసిస్టెంట్ భువనేశ్వర్ కనుసనల్లో జరగడం దమ్మాయిగూడ ప్రజల్లో చర్చనియాంషంగా మారింది.ఇది ఇలా ఉండగా దమ్మాయిగూడ లోని మారుతీ నగర్ లో యూఎల్సి భూమిలో ఆక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని టీపీవో అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ ఆక్రమ అనుమతులు పొదుతు ఇష్టానసారంగా ఇంటి నిర్మాణాలు చేపడుతూ అమాయక ప్రజలకు విక్రయస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ లో ఇలాంటి ఆక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సైట్ విజిట్ చేస్తూ బఫర్ జోన్ లో ఉందా ఎఫ్ టి ఎల్ ఉందా యు ఎల్ సి లో ఉందా కన్జర్వేషన్ జోన్ లో ఉందా ఫారెస్ట్ లో ఉందా అని అన్ని చెక్ చేసిన తర్వాతే అనుమతులు ఇచ్చేవారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డు తొలగడంతో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ కమిషనర్ కు చైర్మన్ లకు తెలియకుండా ఒక్కో పర్మిషన్కు లక్షల్లో లంచాలు పొందడం విడ్డురంగా ఉంది.  ఒక్కొక్క సమస్యకు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి ప్రభుత్వానికి భారీగా గండి కొడుతున్న వైనం మరి కొందరు బిల్డర్లు అయితే ఏకంగా జి+2 అనుమతులు పొంది జి+4 నిర్మాణాలు చేపడుతున్న మునిసిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనక ఆంతర్యమేమిటి అని ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు

a712dfeb-25d3-487d-8b41-facb8bd99c1c

Read More మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్ 

ఆక్రమ నిర్మాణాల విషయమై  కాలనీ వాసులు పాలమార్లు మునిసిపల్ కార్యాలయంలో పిర్యాదు చేసిన నిమ్మకు నీరేత్తి నట్టు వ్యవహరించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్కు ఇవేవి తెలియకపోవడంతో మున్సిపాలిటీ టీపీవో శ్రీధర్ అతని అసిస్టెంట్ భువనేశ్ విచ్చలవిడిగా చెలరేగిపోతు ఒక్కో బిల్డింగ్ కు 2లక్షల రూపాయలు వసూళ్లు చేస్తూ అనుమతులు ఇస్తున్నారు. అన్ని పత్రాలు సరిగా ఉండి అనుమతుల కోసం వెళ్తే కోర్టు కేసులంటూ అనుమతులు రద్దు చేస్తూ లంచాలు ఇచ్చిన వారికి అనుమతులు ఇస్తూ, అమాయక ప్రజలను మోసం చేస్తూ ధమ్మాయిగూడ ప్రగతి నగర్ సర్వేనెంబర్ 575, 576, 579, 582 లో అనుమతులు నిరకరిస్తూ వారిని ముప్పు తిప్పలు పెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పై ప్రత్యేక చొరవ తీసుకోని ఆక్రమాలకు పాల్పడుతున్నా వారిని సస్పెండ్ చేయాలనీ ప్రజలు కోరుతున్నారు. ఇంత తతంగం నడుస్తున్న చైర్మన్ కమిషనర్ కౌన్సిలర్లు మౌనం వహించడం పట్ల సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఆ మౌనం వెనుక కాసులు గలగల మాట్లాడాయని వదంతులు కూడా వినిపిస్తున్నాయి. రోజురోజుకు దమ్మైగూడ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ఈ నగరానికి ఏమైంది అన్నట్టుగానే ఉంటున్న ఈ ఎవ్వరాన్ని కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More 20,72,5000 రూపాయల సిఎంఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు