మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యం

డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ ఆధునిక భారతదేశ పితామహుడు - మామిండ్ల రాహుల్ యాదవ్ (అద్యేక్షులు, ఎన్ఎస్యూఐ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా)

 మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యం

జయభేరి, ఘట్కేసర్ : 

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 163వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్యఅతిథిగా మామిండ్ల రాహుల్ యాదవ్ (అధ్యేక్షులు, ఎన్ఎస్యూఐ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు భారత దేశ ప్రజలు అందరూ సుఖ శాంతులతో ఉన్నారు అంటే డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే అని తెలియజేసారు. ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తుంది అంటే భారత దేశం యొక్క ప్రజాస్వామిక విలువలవల్లే ఆ ప్రజాస్వామిక విలువలు అందించింది భారత రాజ్యాంగం అని తెలియజేసారు.

Read More Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది

ప్రతివారం ఇలా భారత రాజ్యాంగ పీఠిక పై ప్రమాణ స్వీకారం చేయించటం భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలలోకి తీసుకెళ్లడమే అని తెలియజేసారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న యం.అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 23 మే 2024 రోజు 2586వ బుద్ధ పూర్ణిమ సందర్బంగా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బుద్ధ జయంతి (బుద్ధుడు పుట్టిన, జ్ఞానోదయాన్ని పొందిన, మహా పరినిర్వాణం చెందిన రోజు) ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి మూడు సంఘటనలు ఒకే రోజు మరే ఇతర మహా పురుషుని యొక్క జీవితంలో జరుగలేదు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

IMG-20240526-WA1716

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

ప్రాణుల యొక్క దుఃఖాలు రాకుమారుడు సిద్ధార్థుడిని రాజ భవనం నుండి బయటకు తీసుక వచ్చి బిక్షను అడుక్కునే ఒక తపస్విగా చేశాయి. దుఃఖాలన్నింటిని దూరం చేసే నిర్వాణ మార్గాన్ని కనుక్కోవాలను మంచి ఉద్దేశ్యంతో రాజకుటుంబములోని అన్ని రకాల సుఖాలను త్యాగం చేసి ఎంతో కష్ట సాధ్యమైన తపస్వి జీవితాన్ని ప్రారంభించాడు. జననం, వృద్ధాప్యము, రోగము, మరణము మొదలగు అనేక రకాల దుఃఖాలను దూరం చేసే మారాన్ని కనుగొనుటకు పరిశోధనను ప్రారంభించాడు. ఇక్కడ నుండే బౌద్ధం పుట్టింది. బౌద్ధం యొక్క పుట్టుక అన్ని ప్రాణుల పట్ల ప్రేమ మరియు కరుణతో ప్రారంభం అవుతుంది. అలాగే దీని విజయం అన్ని ప్రాణుల ముఖ్యంగా మానవుల దుఃఖ విముక్తి పై ఆధారపడి ఉంది. ఇదే దీని ముఖ్య లక్షణం. మానవుడు వ్యక్తిగతమైన ఏ రకమైన దేవునికి ప్రార్ధన చేయనవసరం లేకుండానే, ఏ పూజలు చేయకుండానే తన యొక్క స్వయంకృషితో, ప్రయత్నంతో ముక్తిని సాధించవచ్చు అని బుద్ధుడు బోధించాడు.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

అంబేద్కర్ 1956 అక్టోబర్ 14 న నాగ్పూర్ లోని దీక్షభూమిలో బహిరంగంగా మతం మార్చారు. అదే వేడుకలో ఆయన అనుచరులు సుమారు 4,00,000 మంది బౌద్ధమతంలోకి మారారు. నాగ్పూర్ తరువాత, 16 అక్టోబర్ 1956 న, అంబేద్కర్ మళ్ళీ చంద్రపూర్ వద్ద తన అనుచరులలో 4,00,000 మందికి బౌద్ధమతాన్ని ఇచ్చాడు అని వివరించారు.

Read More Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎం.అరుణ్ కుమార్. ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ పీఠిక పై ప్రమాణం చేశారు. మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ మాటలు గుర్తుచేశారు.

Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...

ఈ కార్యక్రమం లో మేకల దాస్(అద్యేక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం), కే.నర్సింగ్ రావు, వూట్కూరి అశోక్ గౌడ్ గౌడ్, ఈరిటుం శ్రీనివాస్ (ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ యువజన సంఘం), బనరత్ ప్రసాద్ నాయక్, జి. అనిల్ కుమార్, వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్, వై.వెంకటేశ్వర్ రావు, సిహెచ్.ఆనంద్, ఈ.విష్ణువర్ధన్, డి.భరత్ కుమార్, జి.సచిన్, ప్రవీణ్, జ్.సాయి చరణ్, జ్.అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

Views: 0