BRS : ప్రజలు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు
మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి...
- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శం
- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఏడవల్లి రఘవర్ధన్ రెడ్డి.
జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారంగా మంగళవారం మేడిపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నగర నూతన అధ్యక్షుడిగా బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఏడవల్లి రఘవర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారికి షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాయమాటలతో ఇచ్చిన 6 గ్యారెంటీలు 4 నెలలకే ఆవిరైపోరాడంతో ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్దులకు, వికలాంగులకు పింఛన్, కేసిఆర్ కిట్, ఐ.టీ, పారిశ్రామిక రంగాలలో గణనీయ అభివృద్ధి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
పార్టీని వీడిన ముఖ్య నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకపోవడం, ప్రజల్లో వ్యతిరేకతతో తిరిగి పార్టీ మారాలానే ఆలోచనలో ఉన్నారన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, పాలక మండలి ఆధ్వర్యంలో అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. గత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎం.పి గెలిచిన తరువాత తిరిగి ఒక్కసారి ప్రజలకు కనిపించలేదని ఇప్పుడు మరో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హెలికాప్టర్ వేసుకొని హలో అంటూ వస్తున్నారని తిరిగి బై బై చెప్పి వెళ్లిపోతారని ఏద్దెవా చేశారు.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి స్థానికంగా ఉంటూ ఎన్నో సేవా, సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే మనలో ఒకడిగా ఉంటూ మల్కాజ్గిరిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారన్నారు.

మేయర్ జక్క వెంకట్ రెడ్డిమాట్లాడుతూ.. నేడు 24న జరిగే మల్కాజ్గిరి ఎం.పి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నందున కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలో అందరిని కలుపుకొని కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, కౌడే పోచయ్య, మధుసూదన్ రెడ్డి, ఏంపల్ల అనంత రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతిరెడ్డి, బండి సతీష్ గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, ఏనుగు మనోరంజన్ రెడ్డి,జావీద్ ఖాన్,పైళ్ల ప్రభాకర్ రెడ్డి మల్లం వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


