శాస్త్రీయ విద్యా విధానంపై ఏఐఎస్ఎఫ్ ఉద్యమించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేటి సాంబశివరావు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై హేతుబద్దతతో తిరుగుబాటు నీట్ అవకతవకలకు పాల్పడ్డ బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
- పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి.
- కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల ప్రారంభం.
జయభేరి, హైదరాబాద్ :
వామపక్ష విద్యార్థి నాయకులతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యను అర్జిస్తూనే హేతుబద్దతతో ఆలోచించి పాలనను ప్రతిబింబించే సమాజంపై తిరుగుబాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేటి సాంబశివరావు పిలుపునిచ్చారు. కరీంనగర్లో మంగళవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక, సైద్దాంతిక రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రారంభించారు.
నీట్, యుజిన్- ఎన్ఏటి పరీక్షలో జరిగిన అవతవకలపై సుప్రీం కోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, తక్షణమే అందుకు బాధ్యులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ 7 వేల కోట్ల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు టిసిలు ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలలకు బాధ్యత వహించాలన్నారు. పరిపాలనకు, సమాజానికి సంబంధం లేకుండా దేశంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందన్నారు. పాలనను ప్రతిబింబించే సమాజంపై తిరుగుబాటు చేయాలన్నారు. విద్యను అర్జించే వారికే ఆ హక్కు ఉంటుందని, హేతుబద్దతతో ఆలోచించి ముందుకు పోవాలన్నారు.
ప్రజాస్వామిక లౌకిక దేశం అనే భావన వక్కనపెట్టి మతపరమైన హిందూ దేశంగా మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. వేల సంవత్సరాల చరిత్రలో నకల కుల మతాలు, సంస్కృతీ సాంప్రదాయాలున్న భారతదేశంలో హిందువులకు రక్షణ లేదంటూ బిజెపి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. దేవుడు శాసిస్తాడు.. మోడీ పాటిస్తాడు అనే రీతిలో పాలన సాగుతోందన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా 240 స్థానాలతో బిజెపి నరిపెట్టుకుందన్నారు. వదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు? ఎన్ని ఇళ్లు? ఇచ్చారని ప్రశ్నించారు. విలువలు నేర్పడానికి మతం పుట్టిందన్నారు. 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాముడిని, హిందూ మతాన్ని మోడీ హైజాక్ చేశారన్నారు. రాముడు అందరివాడని వామపక్ష భావాలు కలిగినవారందరూ ప్రభావితం చేయగలగడంతో ప్రజలకు అర్ధమయ్యిందన్నారు.
బ్రిటీష్లు పాలించిన 200 సంవత్సరాలలోనూ హిందువులున్నారు కదా? అని ప్రశ్నించారు. మరి ప్రజాస్వామ్య దేశంలో హిందువులకు రక్షణ లేదని బిజెపి చెప్పడమేమిటన్నారు. కారుచీకటిలో కాంతిరేఖలో వెలుగులు నించడమే కమ్యూనిస్టుల ఆలోచన విధానమన్నారు. చేగువేరా, భగత్ సింగ్ విప్లవవీరులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థి సంఘ నాయకులకు హేతుబద్ధ విధానం, సామాజిక స్పృహ ఉండాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలన్నారు. 80 శాతం సంపద వంద కుటుంబాల చేతుల్లో ఉండగా దేశాన్ని శాసిస్తున్నారన్నారు. జెండాలు పట్టుకోవడమే కాదని చదువుకుంటూనే నమాజాన్ని చదవాలని, ప్రశ్నించే తత్వంతోనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఒక్క సిరాచుక్క లక్షల మెదడులను ప్రభావితం చేయగలుగుతుందని, జిల్లాలో ఏఐఎస్ఎఫ్ నిర్మాణాత్మక కమిటీలు బలోపేతం చేసి సమాజ మార్పుకు కృషి చేయాలన్నారు.
అనంతరం ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత 50 సంవత్సరాల అనుభవంలో విద్య కాషాయీకరణ, శాస్త్రీయ విద్యావిధానం అమలు జరగడం లేదని వాపోయారు. విద్యనందించే ఉపాధ్యాయులకే ఉత్తమ శిక్షణ ద్వారానే మార్పు సాధ్యమవుతుందన్నారు. నాణ్యమైన విద్య అందడం లేదని, కేవలం సర్టిఫికెట్లు సాధిస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జ్ఞానం కోసం చదివి నైపుణ్యం సంపాదించుకుంటే జీవితంలో ముందుకు పోతామన్నారు. అజ్ఞానానికి ఫ్యాక్టరీలు పెరగడమే తప్ప రేపటి సమాజానికి అవగాహన ఎలా? అని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని విధానాలపై ప్రశ్నించాలన్నారు. పోరాటంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే బాధ్యతను గుర్తెరగాలన్నారు. తప్పును ఎత్తిచూవడమే కాదని, నిర్మాణాత్మకంగా | నిలబెట్టేలా ఉండాలన్నారు. తప్పును వరిష్కరించాల్సిన అవసరముందన్నారు. తప్పించుకునే మనస్థత్వం మార్గం వెతకకుండా ముందుడి నిలబడి పోరాడాలన్నారు.
ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొయ్యాడ సృజన్ కుమార్, మాజీ రాష్ట్ర నాయకులు మంద పవన్,ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకుడు మహేందర్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రఘురాం, సోతుకు ప్రవీణ్, రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, జనార్ధన్, అంజి, సంతోష్, వెంకటేష్, శరత్, అన్వర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


