జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి

ఏసీపీ ని కోరిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్

 బోర్ల వద్దకు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దు

 డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదులు చేయండి

జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి

జయభేరి, హైదరాబాద్ : గౌరవప్రదమైన జర్నలిజం వృత్తిని అప్రతిష్టపాలు చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ప్రెస్ క్లబ్ విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు  కూకట్పల్లి ఏసిపి  శ్రీనివాసరావును కలిసి  వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, జర్నలిస్టులది అతి కీలకమైన పాత్ర అని  చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో  కొత్త దోరణిలతో జర్నలిస్టుల విలువలు మస్కబారే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

సామాన్యులకు అండగా నిలవాల్సిన జర్నలిస్టులే  వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తుండడం విచారకరమన్నారు. సమాజంలో ఈ పోకడలతో జర్నలిస్టులు అంటే సామాన్యులకు చులకన భావం ఏర్పడుతుందని ఆవేదన చెందారు. జర్నలిస్టుల విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని ఏసిపిని కోరారు. జర్నలిజం ముసుగులో అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడుతున్న వారి పట్ల  కఠినంగా వ్యవహరించాలన్నారు.

Read More మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి

బోర్ల దగ్గరికి, సామాన్యులు ఇల్లు కట్టుకుంటే వారి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. జర్నలిస్టుల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీపికి జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఉన్న జర్నలిస్టులకు ప్రస్తుతం ఉన్నటువంటి వారికి చాలా వ్యత్యాసం కనిపిస్తుందన్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

జర్నలిస్టుల పట్ల సామాన్యులకు చులకన భావం ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు అందితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు.  జర్నలిస్టు సంఘాల నాయకులు గడ్డమీది బాలరాజు, ఆర్కే దయాసాగర్, నిమ్మల శ్రీనివాస్, ఎం ఏ కరీం,నవీన్ రెడ్డి,  ఏబీఎన్ వేణు, నాగరాజు, క్రాంతి, గంగరాజు, సదా మహేష్, మాణిక్య రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి