అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు
- అమర్ సింగ్ పై కిడ్నప్ కేసు
- ఆ మాజీ ఎమ్మెల్యే అమర్ సింగ్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ లో చర్చ
- అదిష్టానం ముందు పరువు తీసుకున్న జంగయ్య
ఆయన ఓ కార్పోరేటర్. ఓ మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో మేయర్ కుర్చీపై ఆశలు పెంచుకున్నాడు. కౌన్సిల్ లో మెజారిటీ కార్పొరేటర్ల మద్దతు లేకున్నా అదిరించి, బెదిరించి దొడ్డిదారిన మేయర్ కుర్చీ దక్కించుకోవాలనుకున్నాడు.
ఆ కార్పోరేటర్ పేరు అమర్ సింగ్. అతను కిడ్నప్ చేయాలనుకున్నది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డితో పాటు మేయర్ కు మద్దతుగా నిలిచిన కార్పోరేటర్లను. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 19వ తేదీన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలలో అవిశ్వాసం రగడ నడుస్తుంది. అలాగే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ లోను మేయర్ కుర్చీ కోసం అవిశ్వాసం క్యాంపులు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే తన బలం నిరూపించుకునేందుకు మేయర్ తనపై తానే అవిశ్వాసం పెట్టుకున్నాడు. మేయర్ జక్క వెంకట్ రెడ్డికి వ్యతిరేఖంగా అమర్ సింగ్ మేయర్ పదవీ కోసం పోటీ పడ్డాడు. ఈ క్రమంలోనే జూన్ 5వ తేదీన బలనిరూపణ చేసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశాడు.
మితిమీరిన పదవీ కాంక్షతో ...
మితిమీరిన పదవీ కాంక్షతో ఉన్న అమర్ సింగ్ మెజార్టీ కార్పోరేటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అమర్ సింగ్ ను విశ్వసించని మెజార్టీ కార్పోరేటర్లు మేయర్ జక్క పక్షాన నిలబడ్డారు. ఇది జీర్ణించుకోలేని అమర్ సింగ్ మామ, అతని అనుచరులు, కొంత మంది కార్పొరేటర్లు ఈ నెల 19వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డితో పాటు అతనికి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కిడ్నప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండ ప్రైవేటు గుండాలతో దాడికి తెగబడ్డారు.
కిడ్నప్, దాడి కేసులు నమోదు...
ఔటర్ రింగు రోడ్డుపై అమర్ సింగ్ అండ్ కో చేసిన హంగామాపై జక్క వెంకట్ రెడ్డి, కార్పోరేటర్లు బీఆర్ఎస్ పార్టీ తరుపున ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు మేయర్ కిడ్నప్ వ్యవహారంలో అమర్ సింగ్ పాత్రను నిర్ధారించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ లో అమర్ సింగ్ ను ఏ1 నిందితుడిగా చేర్చారు. అలాగే 13వ డివిజన్ కార్నొరేటర్ భర్త తూంకుంట శ్రీధర్ రెడ్డిని ఏ2, 22వ డివిజన్ కార్పోరేటర్ భీంరెడ్డి నవీన్ రెడ్డిని ఏ3, 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త మాడ్గుల చంద్రారెడ్డిని ఏ4, కో అప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డిని ఏ5, 26వ డివిజన్ కార్పోరేటర్ భర్త పప్పుల అంజిరెడ్డిని ఏ6, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ ను ఏ7, కాంగ్రెస్ కార్యకర్త అయిన నర్సింహ్మారెడ్డిని ఏ8 చేర్చడంతో పాటు మరికొందరిపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 365, 147 ఆర్/డబ్ల్యూ 511 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఘట్ కేసర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.
Post Comment