Narendra Modi : వారణాసిలో ప్రధాని నామినేషన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడ కూడా ప్రత్ేక పూజలు చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు వారణాసి కలెక్టరేట్‌కు వెళ్లారు. ప్రధాని మోదీ నామినేషన్‌లో మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిలో సంజయ్ సోంకర్ ఉన్నారు.
జయభేరి, లక్నో, మే 14 :
అతిరథ మహారథులు, రాజకీయ ఉద్దండులు, 12 మంది ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు సమక్షంలో ప్రధానమంత్రి మోదీ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు చేరుకున్న మోది... అక్కడి నుంచి ఒంటరిగానే కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ వేశారు. వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీ... కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నరేంద్రమోదీపై అజయ్‌రాయ్ అనే కాంగ్రెస్ నేత పోటీలో ఉన్నారు. వడోదర, వారణాసిలో 2014లో పోటీ చేసిన మోదీ 2019, 2024లో మాత్రం వారణాసి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరు లక్షలకుపైగా మోజార్టీ వస్తే 2014లో నాలుగు లక్షలకుపైగ మోజార్టీ వచ్చింది. వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీ... ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఉదయం గంగాదేవి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగాదేవికి చీరసారె సమర్పించారు. అనంతరం క్రూయిజ్‌లో వెళ్లి కాళభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగిందీ మోదీ నామినేషన్ ర్యాలీ. ర్యాలీ రథంపై మోదీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మేళతళాలు, పూలు, జైజై ధ్వానాల మధ్య మోదీకి స్వాగతం పలికారు.
కాల భైరవ ఆలయంలో పూజ
గంగాసప్తమి రోజున ఏం తలుచుకున్న జరుగుతుందని పండితుల మాటల ప్రకారం మోదీ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. అంతకంటే ముందు ఆయన అస్సీఘాట్‌లో ప్రత్యేక పూజలు జేశారు. దశ అశ్వమేథ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారే సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడి నుంచి కాల భైరవ ఆలయానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడ కూడా ప్రత్ేక పూజలు చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు వారణాసి కలెక్టరేట్‌కు వెళ్లారు. ప్రధాని మోదీ నామినేషన్‌లో మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిలో సంజయ్ సోంకర్ ఉన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. "నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నాలాంటి చిన్న కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు" అని అన్నారు. అట్టహాసంగా నామినేషన్ వేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతకు ముందు భారీ రోడ్‌షో చేయనున్నారు. సుమారు ఆరు కిలోమీటర్ల సాగిందీ యాత్ర.


