Blast in Factory:ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

Blast in Factory:ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

జయభేరి, ఛత్తీస్‌గఢ్‌ :

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది..

Read More Kavitha will be Produced in the Rouse Avenue COURT TODAY I రూస్ అవెన్యూ కోర్టులో కవితను అధికారులు హాజరుపరచనున్నారు...

ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు..

Read More Bhagat Singh I స్వాతంత్య్రం కోసం ఉరి గడ్డను ముద్దాడిన భారత మాత విప్లవ చైతన్యానికి ప్రతీక

ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

Read More Khattar Resigns I హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కారణం ఇదే

Views: 0

Related Posts