Total Solar eclipse on April 8 : ఏప్రిల్ 8 ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం

54 ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం... చివరిగా 1970లో సంపూర్ణ గ్రహణం ఏర్పడింది

Total Solar eclipse on April 8 : ఏప్రిల్ 8 ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం

రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు సహా మొత్తం నాలుగు గ్రహణాలు ఈ సంవత్సరంలో ఏర్పడనున్నాయి. ఇప్పటికే గత నెలలో తొలి చంద్రగ్రహణం ఏర్పడింది.

వాషింగ్టన్: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది.ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడడం ఇదే తొలిసారి. ఇలాంటి సూర్యగ్రహణం చివరిసారిగా 1970లో సంభవించిందని.. కానీ భారతదేశంలో అది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అరుదైన గ్రహణం సమయంలో భారతదేశంలో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు.

Read More హత్రాస్ ఘటన... గుండెలు పిండేసే విజువల్స్

ఇతర దేశాలలో, సంపూర్ణ సూర్యగ్రహణం పగటిపూట ఏడున్నర నిమిషాల పాటు చీకటిగా ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9 మధ్యాహ్నం 02:22 గంటలకు ముగుస్తుంది. అయితే, ఈ అద్భుతం మెక్సికోలోని పసిఫిక్ తీరం నుండి మొదలై, యునైటెడ్ స్టేట్స్ గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆయా ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించనున్నారు. ఈ గ్రహణం మెక్సికోలోని మజాట్లాన్ నుండి న్యూఫౌండ్‌ల్యాండ్ వరకు అలాగే యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా మందికి కనిపిస్తుంది.

Read More ఎవరీ బోలే బాబా...

Social Links

Related Posts

Post Comment