గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా...
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
నందిగామ మండల ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
హాజరైన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి
నందిగామ మండలంలో వివిధ గ్రామాలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు... గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం తరఫున తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజక వర్గంలో నందిగామ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నందిగామ మండల పరిషత్ అధ్యక్షురాలు ఎం. ప్రియాంక శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. నందిగామ మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంతో పాటు ఆంతి రెడ్డి గూడ , నరసప్ప గూడ, చేగుర్ గ్రామాల్లో పర్యటించి ఆయా పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. నందిగామ మండల కేంద్రంలో మన ఊరు మన బడి క్రింద 22 లక్షల రూపాయలతో మంజూరైన ప్రైమరీ స్కూల్ ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా నందిగామ మండల కేంద్రంలో ఎస్ డి ఎఫ్ నిధులు రూ.1 కోటి రూపాయలతో నిర్మించే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నూతన భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండలం ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. అలాగే మహిళా సమాఖ్య భవనం, కిచెన్ షెడ్ ను నిర్మించుటకు శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా అంతి రెడ్డిగూడెం గ్రామంలో ఎస్.డి.ఎఫ్ నిధులు 25 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించటకు ఎమ్మెల్యే శంకర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతి రెడ్డిగూడెం గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనం ఈ సందర్భంగా వారు ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని నరసప్ప గూడ లో హెచ్ఎండిఏ నిధులు 5 లక్షలతో నిర్మించే సిసీ రొడ్డులకు శంకుస్థాపన చేశారు. చేగూర్ గ్రామంలో
హెచ్ఎండిఏ నిధుల ద్వారా మంజూరైన దాదాపు 15 లక్షల సిసి రోడ్డులను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభోత్సవం చేశారు.
నందిగామ మండల పర్యటనలో భాగంగా దాదాపు 2.17 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు మండల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


