త్యాగధనుడు కొండాలక్ష్మణ్ బాపూజీ 

మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి

త్యాగధనుడు కొండాలక్ష్మణ్ బాపూజీ 

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 21: కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ లో పద్మశాలి సంఘం  ఆధ్వర్యంలో అధ్యక్షులు రాజారాంతో కలిసి విగ్రహానికి  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడాతూ... క్విట్ ఇండియా పోరాటం, ముల్కీ ఆందోళన, తెలంగాణ ఉద్యమం తదితర వాటిలో తనదైన పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. నిజాం వ్యతిరేక, తొలి, మలి దశ ఉద్యమాల్లో బాపూజీ పోరాటం స్పూర్తి దాయకమని అన్నారు.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం.. 

అతి సామాన్య కుటుంబం నుండి ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం బాపూజీదని, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడని వారు కొనియాడారు. నాటి ఉద్యమ కారులకు అండగా న్యాయ సహాయం అందించారని, మలిదశ పోరాటానికి వేదికగా తన ఇల్లు జలదృశ్యాన్ని మలిచిన దీశాలని స్పష్టం చేశారు.

Read More వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

అలాగే మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించగా, ఆలాగే అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచి బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా సర్వస్వం ధారబోసినట్లు చెప్పారు. తన జీవిత కాలం పేదల కోసమే తపించగా,  ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 
ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్,  పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, నేతలు శ్రీనివాస్, బలరాం, సత్యనారాయణ, అజ్గర్, నేత నాగరాజు, ప్రేమ్ కుమార్, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More అపూర్వం ఆత్మీయ సమ్మేళనం