బ్రిడ్జి పై చెట్లని వెంటనే తొలగించాలి...
అమ్మ ఫౌండేషన్
జయభేరి జనగామ జులై 29: పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి జిల్లా హాస్పటల్ వరకు ఉన్న బ్రిడ్జ్ ఫ్లై ఓవర్ పై ఉన్న చెట్లను వెంటనే తొలగించాలి ప్రమాదకరమైన పగుళ్లు ఫ్లై ఓవర్ పైన ఫుట్పాత్ పైన ఉన్నటువంటి పూల కుండీలను తొలగించి బాటసారిలకు ఇబ్బందికరంగా ఉండకుండా చూడాలి సమస్యలను పరిష్కరించాలి.
కానీ అక్కడ ఎటువంటి ప్రమాదకర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేకపోవడం చాలా బాధాకరం వెంటనే రేడియంతో కూడిన డివైడర్ ఉన్న విషయాన్ని తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలి.వెంటనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమస్యలపై గౌరవ జనగామ మున్సిపల్ కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్వయంగా పరిశీలించి ఇక్కడున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జనగామ ప్రజల పక్షాన వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు లకన్ సింగ్. కొల్లూరు చందు. చిక్కుడు నాగేష్. పవన్.తదితరులు పాల్గొన్నారు.
Post Comment