ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

జయభేరి, ఆగస్టు 26:- ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. దూళ్ళ మోహన్ కృష్ణ అనే యువకుడు తన బాబాయి ఇంటి వద్ద ఉంటూ తుంకుంట లోని మోర్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు.

కాగా ఈ నెల 21 న మధ్యాహ్న సమయంలో కొంపల్లి లోని విజేత సూపర్ మార్కెట్ కు వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళాడు. సాయంత్రం వరకు కూడ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో వెతికారు. అయినా మోహన్ కృష్ణ ఆచూకీ లభ్యం కాకపోవడంతో శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుని ఆచూకీ లభిస్తే పోలిసులకు సమాచారం అందించాలని కోరారు.

Read More సెప్టెంబర్ 17న  ప్రజా పాలన దినోత్సవం

Latest News

నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు
జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా మురహరిపల్లి గ్రామంలో రవి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు...
800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక
ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం
అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ