ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఏకగ్రీవం...

పట్టణ శాఖ అధ్యక్షుడిగా అత్తెల్లి శ్రీనివాస్ గుప్త 

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఏకగ్రీవం...

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 22. :
గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా జగ్గయ్యగారి శేఖర్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పట్టణ శాఖ అధ్యక్షులుగా అత్తెల్లి శ్రీనివాస్ గుప్త ఎన్నిక కాగా, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేతలు గంప శ్రీనివాస్ గుప్త, అయిత రత్నాకర్ గుప్త, జిల్లా అధ్యక్షులు కాచం నవీన్ గుప్త, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త హాజరయ్యారు. 

అనంతరం వారు మాట్లాడుతూ గజ్వేల్ మండల, పట్టణ శాఖ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఏకగ్రీవం అవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అయితే నూతనంగా ఎన్నికైన కార్యవర్గాలు గజ్వేల్ పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు పదవులకు వన్నె తేవాలని ఆకాంక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని స్పష్టం చేయగా, తమపై నమ్మకం ఉంచి మండల, పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఆర్యవైశ్యులకు అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ గుప్త, అత్తెల్లి శ్రీనివాస్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు. 

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మంకాల శ్రీనివాస్ గుప్త, సముద్రాల హరినాథ్ గుప్త, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రావికంటి చంద్ర శేఖర్ గుప్త పాల్గొన్నారు.గజ్వేల్ మండల  ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుగా జగ్గయ్యగారి శేఖర్ గుప్త, ఉపాధ్యక్షుడు మల్యాల వెంకటేశం గుప్త, ప్రధాన కార్యదర్శిగా సూర ఆంజనేయులు గుప్త, కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం గుప్తలతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 

Read More Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడుగా అత్తెల్లి శ్రీనివాస్ గుప్త, ఉపాధ్యక్షుడుగా అయిత సత్యనారాయణ గుప్త, ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్ గుప్త, కోశాధికారి కొమురవెల్లి రమేష్ గుప్త ఎన్నిక కయ్యారు. సలహాదారులు, సీనియర్ నాయకులు సిద్ది బిక్షపతి గుప్త, అత్తెల్లి లక్ష్మయ్య గుప్త, మరుమాముల ఓంకార్ గుప్త, మహంకాళి శ్రీనివాస్ గుప్త, కొమురవెల్లి శంకరయ్య గుప్త, భద్రయ్య గుప్త, కైలాస ప్రశాంత్ గుప్త, ఉమేష్ గుప్త, సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

Views: 0