పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది
కేంద్రంలో ఉన్న బిజెపి పాలమూరుకు ఒక్క పైసా ఇయ్యలే...
బీఆర్ఎస్ ప్రజల్లో అపూర్వస్పందన...
ప్రజా సంక్షేమాన్ని అందించిన కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలపండి... ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
జయభేరి, చౌదరిగూడ :
ప్రభుత్వ పాలనపై పట్టు లేని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసిఆర్ ఫై అర్థం లేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్పా, ప్రజా సంక్షేమంపై దృష్టి లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని, ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా చేయలేదని, ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని ఆరోపించారు. పాలమూరు అభివృద్ధి కి ఒక్క పైసా కుడా ఇవ్వని బీజేపీ కి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.
అబద్దాలను ప్రచారం చేస్తూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపొండాలని చూస్తున్నాయని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సంపూర్ణ సంక్షేమాని అందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కరువు తప్ప, అభివృద్ధి లేదని, రైతులను పట్టించుకున్నా పాపన పోలేదని వాపోయారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితితులను గమనించి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచే బీఆర్ఎస్ కు మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల మద్దతు ఊహించని స్థాయిలో రావడం సంతోషకరమని అన్నారు.
Post Comment