పాడైన ఆహారపదార్ధాలు... హోటళ్లలో షాకింగ్ సీన్స్
ఖైరతాబాద్ లోని కామత్ హోటల్ లో కూడా తనిఖీలు జరిగాయి. తయారీ వివరాలు లేనినూడిల్స్ తో పాటు టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు రూ. 25వేలుగా ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు అక్కడ దొరికే ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జయభేరి, హైదరాబాద్, మే 20 :
హైదరాబాద్ లో ఎక్కడ చూసిన హోటళ్లు, రెస్టారెంట్లు భారీగా కనిపిస్తుంటాయి. ఆహార ప్రియులు కూడా అంతే స్థాయిలో అక్కడికి వెళ్తుంటారు. ఇష్టమైన ఆహారాలను తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక వీకెండ్స్ వస్తే…. చాలా కుటుంబాలు రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే అన్నట్లు ఉంటుందపెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లకు వెెళ్తే ఆహార ప్రమాణాలను పాటిస్తారనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే చాలాచోట్ల అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
పాడైపోయిన 20 కేజీల మైదా పిండిని గుర్తించారు. పురుగులు పట్టి పాడైపోయిన 2 కేజీల చింతపండును గుర్తించారు. ఉపయోగించే గడువు తేదీ ముగిసిన పాలను గుర్తించారు. 168 గోలిసోడా బాటిళ్లను సీజ్ చేశారు. వీటికి తయారీ లైసెన్స్ లేదు. వెజ్ - నాన్ వెజ్ నిల్వ చేసే పద్ధతిలో ప్రమాణాలను పాటించటం లేదు. హోటల్ లో పరిశుభ్రత సమస్యలు ఉన్నాయి.
ఇదే ప్రాంతంలో ఉన్న లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ కూడా లోపాలను గుర్తించారు. ఆహార పదార్థాల నిల్వ నిర్వహణ పద్ధతులు సరిగా లేవని తేలింది. పరిశుభ్రతతో పాటు నీటి సమస్యలను గుర్తించారు. కొన్ని ఆహారపదార్థాలను విశ్లేషించేందుకు ల్యాబ్ కు పంపినట్లు అధికారులు ప్రకటించారు.
ఖైరతాబాద్ లోని కామత్ హోటల్ లో కూడా తనిఖీలు జరిగాయి. తయారీ వివరాలు లేనినూడిల్స్ తో పాటు టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు రూ. 25వేలుగా ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు అక్కడ దొరికే ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహర ప్రమాణాల విషయంలో అనుమానాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా…. హోటళ్లు,రెస్టారెంట్లు పరిశుభ్రతతో పాటు నిర్ణయించిన ఆహార ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


