విషాదం నింపిన ఈత సరదా...

నేరేడు గొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద  సాగర్ బ్యాక్ వాటర్ లో  యువకుడు ప్రమాదవశాత్తు మునిగిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ మునిబుద్దిన్  (22) బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జలాలను చూసేందుకు వెళ్లారు.

విషాదం నింపిన ఈత సరదా...

జయభేరి, దేవరకొండ :
ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సరదాగా కుటుంబ సభ్యులతో  కలిసి ఈత కొడదామని వెళ్లిన ఓ యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు మిగిలాయి. 

నేరేడు గొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద  సాగర్ బ్యాక్ వాటర్ లో  యువకుడు ప్రమాదవశాత్తు  మునిగిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ మునిబుద్దిన్  (22)  బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జలాలను చూసేందుకు వెళ్లారు. యువకుడికి ఈత రాకపోవడంతో కృష్ణా జలాలలో గల్లంతయ్యాడు. బుధవారం రాత్రి వరకు గజ ఈతగాళ్లతో వెతకగా ఫలితం లేకపోయింది. గురువారం గజఈత గాళ్ల సాయంతో మృతదేహంను బయటకు తీశారు. మధ్యాహ్నం సమయంలో యువకుడి మృతి దేహం లభ్యమయింది. 

Read More దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

బాలుడి మృతదేహాన్ని బయటకు తీస్తున్న క్రమంలో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని బాలుడు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేశారు. శవ పరీక్ష నిమిత్తం దేవరకొండ ప్రాంతీయ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సతీష్ తెలిపారు.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

cb129558-f1e1-4b09-aa97-bb9077a37d0b

Read More ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు

Views: 0

Related Posts