స్వర్ణగిరి కి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
స్వర్ణగిరి ఆలయం నుంచి జేబియస్ బస్ స్టేషన్ కు మధ్యాహ్నం 12:10,1:10 గంటలకు అలాగే రాత్రి 8,9 గంటలకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఆలయం నుంచి తిరిగి ఉప్పల్ క్రాస్ రోడ్స్ సాయంత్రం 4:45,5:45 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.
జయభేరి, హైదరాబాద్, జూన్ 27:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవలే ప్రారంభమైన స్వర్ణగిరి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లే భక్తులంతా ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి రెండు ఈ - మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసి బస్సులను ఆలయానికి నడపనునట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులు ప్రతీ రోజూ ఉదయం 7, 8 గంటలకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయల్దేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి. ఇక మధ్యాహ్నం 2:50,3:50 గంటలకు తిరిగి ఆలయాం నుంచి హైదరాబాద్ బయలుదేరుతాయి. ఇక ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఆ ఆలయానికి ప్రతిరోజూ ఉదయం 7:30,8:30,10:30,11:35 గంటలకు అలాగే మధ్యాహ్నం 3:20 గంటలకు, సాయంత్రం 4:20,6:25,7:25 గంటలకు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. స్వర్ణగిరి ఆలయం నుంచి జేబియస్ బస్ స్టేషన్ కు మధ్యాహ్నం 12:10,1:10 గంటలకు అలాగే రాత్రి 8,9 గంటలకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
ఆలయం నుంచి తిరిగి ఉప్పల్ క్రాస్ రోడ్స్ సాయంత్రం 4:45,5:45 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే జేబీఎస్ నుంచి వెళ్లే బస్సులో ఒక్కొకరికి టికెట్ ధర రూ.100, ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్లే బస్సులో రూ.80 గా అధికారులు నిర్ణయించారు.


