సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా బైక్, ఆటోలతో ర్యాలీ

మతోన్మాదాన్ని ప్రోత్సహించే బిజెపి నీ ఓడించండి:-రచ్చ కిషన్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి

సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా బైక్, ఆటోలతో ర్యాలీ

జయభేరి, మేడిపల్లి :

మేడిపల్లి మండలం, బోడుప్పల్, పీర్జాదిగూడ, జంట కార్పొరేషన్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్  పెద్ద ఎత్తున బైక్ మరియు ఆటో తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిపిఐ పార్టీ బలపరిచిన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ  మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బైక్& ఆటోలతో బోడుప్పల్ కార్పొరేషన్ ఇందిరానగర్ కాలనీ నుంచి పీర్జాదిగూడ కార్పొరేషన్ చెంగిచెర్ల చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యురాలు జె.లక్ష్మి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు వి.బి బాలరాజ్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి దండు రమేష్, మహిళా సమాఖ్య మండల కార్యదర్శి సి.హెచ్ మాధవి, బి కే ఎం యు మండల కార్యదర్శి కే మహాలక్ష్మి పాల్గొన్నారు. రచ్చ కిషన్ మాట్లాడుతూ గత పదేళ్లు దేశాన్ని పాలించిన బిజెపి అత్యంత ప్రజా వ్యతిరేకంగానూ, మతవిద్వేషాలను రెచ్చగొడుతూ నిరంకుశ పాలన కొనసాగించిందన్నారు. బిజెపి పార్టీ నీ ఈ ఎన్నికల్లో ఓడించాలని మేడిపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Read More ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్

IMG_20240510_193227

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డినీ మేడిపల్లి మండల సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం సిపిఐ పార్టీ కార్యకర్తలు శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ నాయకులు ఇస్తారి, ఉప్పల కొమరయ్య, జ్యోతి, నరసమ్మ, జి నాగరాజు, సోమరాజు, బొందయ్య, స్వామి, నరేష్, రఘు, సంపత్, ఖాదర్ ఆటో యూనియన్ నాయకులు D మదర్, వెంకటేష్, మల్లేష్, మణిదీప్, బాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు హరీష్, చిన్నబాబు, అరవింద్, ఆదిత్య, కార్తీక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.

IMG-20240510-WA3210

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్