ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా పరిసరాలు శుభ్రపర్చుకోవాలి...
జయభేరి, పరకాల, డిసెంబర్ 04:
బుధవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా 18, 19వ వార్డులలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. అనంతరం ప్రజల నుండి వచ్చే వినతులను స్వీకరించి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలకుల మోసపూరిత మాటలు విన్న ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటే ఉన్న గూడును విప్పి పందిరి వేసుకుని జీవిస్తున్నారన్నారు.
ప్రతి ఇంటిలో నాలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి, త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. ఇందుకు ఇటీవల సామాజిక ఆర్థిక కులగనున చేసిందన్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత, శిథిలా వ్యవస్థలో ఉన్న ఇంటికి రెండో ప్రాధాన్యత, ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలందరికీ ఐదు సంవత్సరాలలో ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో దరఖాస్తులు స్వీకరించి గ్రామసభలు ఏర్పాటుచేసి గ్రామాలలో ఉన్న వారికి ప్రియారిటి ప్రకారం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
Post Comment