వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి

వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?

జయభేరి, పరకాల, డిసెంబర్ 04:
పరకాల పట్టణ కేంద్రంలో వంద పడకల హాస్పిటల్ భవన నిర్మాణం శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాల కావస్తున్న  ఇప్పటివరకు పూర్తి కాకపోవడం  నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి  విమర్శించారు. సిపిఎం ప్రజా సంఘ నేతలు  హాస్పిటల్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు.

గత ప్రభుత్వం హయాంలో 2022 సంవత్సరంలో,  వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణము చేపడితే, ఇప్పటివరకు పనులు పూర్తికాక పోవడం, నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టడం పట్ల ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని, నిర్మాణ పనులు నత్తనడకన నడవడం వల్లే సరైన సమయంకు పూర్తి కాలేకపోతుందని, తొందరలోనే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రారంభించే ముందు చెప్పిన ప్రజా ప్రతినిధులు, ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయారని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక చాలామంది ప్రైవేటు హాస్పటల్ ను సంప్రదిస్తున్నారని, ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయని, ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు సరిపడ సౌకర్యాలు ఉంటే ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండకపోయేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పట్ల దృష్టి సారించాలని, వెంటనే పనులు పూర్తిచేసి అన్ని రకాల వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పరకాల పట్టణ కమిటీ సభ్యులు మడికొండ ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓ.చిరంజీవి, కొమురయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం