నీట్ పేపర్ లీకేజీ పెద్ద కుంభకోణం
సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి.. ఘట్ కేసర్ లో సీపీఎం నిరసన
జయభేరి, ఘాట్ కేసర్ :
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి ఎన్ సబిత మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై అక్షయ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించిందని కేంద్ర బిజెపి నేతలు కేంద్ర విద్యా శాఖ అధికారులు కుమ్మక్కై పేపరు లీకేజీ వ్యవహారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఉందన్నారు. ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాలైన హర్యానా గుజరాత్ బీహార్ వంటి రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగాయన్నారు నీటి పరీక్ష పేపర్ లీకేజీ అయిన తర్వాత బీహార్లో 30 నుంచి 40లక్షలు వసూలు చేసిన 13మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని వెంటనే రద్దు చేయాలన్నారు దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర బిజెపి పాలకులు చెలగాటమాడుతున్నారని విమర్శించారు ప్రధాని ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మౌనం వీడి దేశ ప్రజలకు విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
నీటి పరీక్ష నిర్వహించే బాధ్యత రాష్ట్రాలకే వదిలేయాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రాలకు నీటి పరీక్ష నిర్వహించే అర్హత కల్పిస్తేనే పారదర్శకత ఉంటుందని చెప్పారు విద్యార్థులు ఎవరు ఆందోళన చెందకుండా బిజెపి కేంద్ర విద్యా శాఖ అధికారులు యొక్క దుర్మార్గ నీతిని ఖండించాలన్నారు సుప్రీంకోర్టు జడ్జి తో న్యాయ విచారణ జరించాలని ఆమె డిమాండ్ చేశారు. సిపిఎం విద్యార్థులందరికీ అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు కడమంచి యాదగిరి కొయ్యడ చంద్రమోహన్ ఆర్ శ్రీనివాస్,జి నాగమణి కే నీరజ రెడ్డి ఆర్ నరసింహ లక్ష్మి లత పోచయ్య తదితరులు పాల్గొన్నారు


