BRS : ఈటెల రాజేందర్ సేవలు దేశానికి చాలా అవసరం
- కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి
- ఈటెల ను ఈ సారి భారీ మెజారిటీతో గెలిపించాలి - హరిదీప్ సింగ్ పూరి
- సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు ఈటెల రాజేందర్
జయభేరి, ఏప్రిల్ 18 :
అంతకుముందు ఈటెల నివాసం నుండి మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు బీజేపీ నేతలతో కలిసి ఈటెల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులు, ఈటెల రాజేందర్ సమక్షంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఆయన సతీమణి స్వప్న తో పాటు బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ సునీల్ గౌడ్ సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి మాట్లాడుతూ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి గా ఈటెల రాజేందర్ నామినేషన్ వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజకీయ రంగంలో అనుభవం కలిగి, 7 ఏళ్ళు మంత్రిగా ఈటెల పనిచేశారని గుర్తు చేశారు. కరోన ఆపద సమయంలో కూడా ఈటెల చేసిన సేవలను కొనియాడారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఈటెల ను గెలిపించి పార్లమెంట్ కు పంపుతారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఆయన సేవలు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఎంతో అవసరం అని తెలిపారు.
మోడీ నాయకత్వం లో ఆయన పనిచేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈటెల గెలుపు అనంతరం తాను మళ్ళీ వస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ యావత్ దేశం మొత్తం మళ్ళీ ప్రధాని మోడీ కావాలని కోరుకుంటున్నారని. మోడీ తోనే సంపూర్ణ భవిష్యత్ ఉందని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లిం మహిళలు సైతం మోడీ వైపు ఉన్నారన్నారు. దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రజల మనస్సును మార్చలేరన్నారు. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ముందుకు వస్తుందని, ఆ ప్రలోభాలకు తలొగ్గిదని మల్కాజ్ గిరి ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు ఏ మాత్రం తేడా లేకుండా పోయిందని అన్నారు. మల్కాజ్ గిరి పట్ల తనకొక విజన్ ఉందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజల బాధలను గుర్తించానని, ఈ సారి తనను గెలిపిస్తే సంపూర్ణ అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ అభ్యర్థి వంశీ తిలక్, మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ ఇంచార్జ్, ఆర్ముర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావ్, మాజీ ఎమ్మెల్యే లు బొడిగే శోభ, ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్, సామ రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, నియోజకవర్గ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, మల్లారెడ్డి, మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాజయ్య యాదవ్, బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, మల్క కొమురయ్య, సుధాకర్ గాండే, వీకే మహేష్, నారెడ్డి నందారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, గిరివర్ధన్ రెడ్డి, కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


