Nalgonda Police I డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) కవాతు

కేంద్ర బలగాల డిఎస్పి బెటాలియన్ ఇన్చార్జి భాటియా  ఆధ్వర్యంలో పోలీసుల కవాతు కార్యక్రమం నిర్వహించారు.

Nalgonda Police I డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) కవాతు

జయభేరి, దేవరకొండ :

రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు ఇబ్బందులు కలగకుండా దేవరకొండ పట్టణ కేంద్రంలో బుధవారం డీఎస్పీ గంటా గిరిబాబు, కేంద్ర బలగాల డిఎస్పి బెటాలియన్ ఇన్చార్జి భాటియా  ఆధ్వర్యంలో పోలీసుల కవాతు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి గిరి బాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలానుసారం రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలు, దేవరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, టిఎస్ఎస్పి పోలీస్ సిబ్బందితో కవాతు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఎన్నికలలో మత ఘర్షణలు, శాంతిభద్రత సమస్యలు, ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలు, చట్టా వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూస్తామన్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

a6458a89-413e-4de7-8a0b-8feb3d2b61fa

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

రాజకీయ పార్టీల నేతలు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహించడం తమ కర్తవ్యమని అన్నారు.ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించినా వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది 54 మంది తో పాటు దేవరకొండ సీఐ నరసింహులు, డిండి సీఐ సురేష్ బాబు , దేవరకొండ ఎస్సై రమేష్, నేరేడుగుమ్ము ఎస్సై సతీష్, 15 మంది సివిల్ కానిస్టేబుల్స్, సివిల్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి