MLC Kavitha I కవిత నేడు కోర్టుకు.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!

మరోవైపు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.

MLC Kavitha I కవిత నేడు కోర్టుకు.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!

ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది.

ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. శనివారం రోస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట కవితను హాజరుపరచనున్నారు. అదే సమయంలో మరో ఐదు రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవితను న్యాయమూర్తి మరోసారి ఈడీ కస్టడీకి అప్పగిస్తారా.. లేక జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. కవిత కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నేతలు కవిత బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్‌పై కూడా నేడు వాదనలు వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నందున కవిత, ఆయన్ను కలిసి విచారించే అవకాశాలున్నాయని, అందుకే ఈడీ మరో ఐదు రోజుల కస్టడీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. మార్చి 16న ఆమెను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కవిత వారం రోజులుగా ఢిల్లీ ఈడీ కస్టడీలో ఉన్నారు. నేటితో ఈడీ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ కస్టడీ కోరకుంటే జడ్జి అతడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తారా.. లేక బెయిల్ మంజూరు చేస్తారా అనేది సాయంత్రంలోగా తేలనుంది.

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

మరోవైపు కవిత కేసులో ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని కవిత తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కవితను అరెస్ట్ చేశామని ఈడీ చెబుతోంది. మరి కవిత విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు 

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి