రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో మంత్రి సీతక్క భేటీ
జయభేరి, ములుగు : ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022 లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ కు వినతి పత్రం సమర్పించిన సీతక్క.
అదే బిల్లులో GHMC చట్టానికి సవరణలు ప్రతిపాదించిన గత ప్రభుత్వం. దీంతో గందరగోళంగా ములుగు మున్సిపాలిటీ బిల్లు. సభ్యుల గందరగోళం నడుమ 2022లో బిల్లును పాస్ చేసిన గత ప్రభుత్వం. న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాల నేపథ్యంలో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిన గత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్. దీంతో పెండింగ్ లోనే ములుగు మున్సిపాలిటీ బిల్లు.
బిల్లు వివరాలు గవర్నర్ కి అంద చేసి ములుగు కి మున్సిపాలిటీ హోదా కల్పించే బిల్లు కి ఆమోద ముద్ర వేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి వర్యులు సీతక్క. మంత్రి వెంట ఖానాపూర్ ఎంఎల్ఏ వేడ్మ బొజ్జు ఉన్నారు
Latest News
మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలి
18 Jan 2025 13:02:11
జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పై ప్రశ్నించిన బిజెపి నాయకులపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ...
Post Comment