బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం

ముఖ్య అతిధిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి

బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 24 : 
హైదరాబాద్‌లోని వివిధ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

సమావేశంలో ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయెంచాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డిని కోరారు. నగరంలోని వివిధ వార్తాపత్రికలలో పనిచేస్తున్న ఉద్యోగులు వార్తాపత్రికల ప్రచురణలో తమ పాత్రల ప్రాముఖ్యతను తెలియజేసారు. వర్కింగ్ జర్నలిస్టులతో సమానంగా సంక్షేమ పథకాలు, ప్రయోజనాల రూపంలో తమ సహకారాన్ని గుర్తించాలని కోరారు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

dd-1-1024x537

Read More Auto I షౌకత్ గ్యారేజ్

టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు టి.కోటిరెడ్డి తమ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఆర్టిస్టులు, లైబ్రేరియన్లు, స్కానింగ్ ఆపరేటర్లు అందరూ న్యూస్‌రూమ్‌లలో అంతర్భాగమని, వార్తాపత్రికల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. బి శ్రవణ్ కుమార్, భాను ప్రసాద్ సింగీతం ఆధ్వర్యంలోని వివిధ శాఖల ఉద్యోగులు కె శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... వర్కింగ్ జర్నలిస్టులుగా ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లందరికీ అర్హులైన అన్ని సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.

Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...

abcccc-1-1024x456

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

Views: 0