శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

జయభేరి, ఘట్కేసర్ : 

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ కాచవాని సింగారం గ్రామంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యవర్గ సభ్యులు బస్వా రాజు గౌడ్, బూత్ అధ్యక్షులు దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మొక్క నాటి వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

IMG-20240623-WA1584

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

దేశంలో ఒకే పౌరసత్వం, కాశ్మీర్లో అవరోధంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, పెద్ది స్నేహ, జితేందర్ గౌడ్, బస్వ మమత,రాజేష్, మల్లేష్ యాదవ్, సాయిరాం, తేజ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

Views: 0