KU : మాజీ వీసీ అక్రమాలను బయటపెట్టాలి
వీసీ లాడ్జి నుండి ఫైళ్లు మాయం సంఘటనపై విచారణ కమిటీ వేయాలి... అకుట్ అధ్యక్ష కార్యదర్శులు
ఈ ఫైళ్ల తరలింపు కార్యక్రమం కొందరు సంబంధం లేని వ్యక్తుల ద్వారా జరిగిందని గతంలో అకుట్ ఆరోపించినా రిజిస్ట్రార్ ప్రో. మల్లారెడ్డి పట్టించుకోవట్లేదని మాజీ వీసీ కి వంతు పాడుతూ ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ బయట పెట్టడం లేదని తెలిపారు. పదవీ కాలం చివరి నాలుగు రోజులు మాజీ వీసీ యూనివర్సిటీకు రాకున్నా కూడా అక్రమ బదిలీలు, పదవుల ఆర్దర్లపై పెట్టిన సంతకాలు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు.
జయభేరి, వరంగల్ :
మూడేళ్లలో అనేక అక్రమాలకు పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, అడ్డగోలుగా నియామకాలు చేసుకుని ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేయూ మాజీ వీసీ, తనపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరపబోతుందని తెలుసుకున్న వెంటనే ఆ ఫైళ్లను వీసీ లాడ్జి నుండి మాయం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆకుట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రో టీ శ్రీనివాస్, డా. మామిడాల ఇస్తారీలు ఒక ప్రకటనలో తెలిపారు.
సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసారు
అక్రమాలకు నిలయమయిన ఫైళ్ళను మాయం చేయడానికి, సంబంధం లేని వ్యక్తులు వీసీ లాడ్జీలోకి రావడం లాంటివి తెలువకుండా చేయడానికి వీసీ లాడ్జిలో సీసీ కెమెరాలు గత కొన్ని రోజులకు ముందే పనిచేయకుండా చేసీ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. వీసీ లాడ్జిలో పనిచేయని సీసీ కెమెరాల వీసీ గదిని సీల్ చేయడం విడ్డూరం అని, మొదటి, రెండవ గేటు వద్ద గల సీసీ కెమెరాల ఫుటేజ్ కు సంబంధించిన డీ.వీ.ఆర్ లో నుండి ఇప్పటి వరకు కెనరా ఫుటేజ్ పరిశీలించకుండా కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. వెంటనే సీసీ టీవీ ఫుటేజ్ కు సంబంధించిన డివైజ్ లను విజిలెన్స్ వారికి అప్పచెప్పాలని లేదా వాటిని పరిశీలించి ఫైళ్ళను మాయం చేసిన వారిపై కేసులు పెట్టాలని అన్నారు.
పరీక్షల విభాగంలో జవాబు పత్రాలను బయటకు తీసుకువచ్చిన దినసరి వేతనం తీసుకునే ఉద్యోగులపై, అడ్డా లేబర్లపై సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి కేసులు పెట్టిన రిజిస్ట్రార్ మల్లారెడ్డి మాజీ వీసీ చేసిన అక్రమాలను, వాటి సీసీ ఫుటేజ్ పరిశీలించకుండా ఎందుకు వెనకేసుకు వస్తున్నారో చెప్పాలని అన్నారు. వీసీ లాడ్జి నుండి ఫైళ్లు మాయం సంఘటనపై వెంటనే విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి, ఇన్చార్జి వీసీ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
Post Comment