అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్

జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‎ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్

హైదరాబాద్, జూలై 23 :
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‎ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే లాస్యనందిత మృతికి సభ్యులు సంతాపం తెలపనున్నారు.

Read More విశాల సహకార పరపతి సంఘం లి

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ ప్రతిపక్షపాత్రకు పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుకు తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరగడం, వైద్యులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఆయన లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలు సాగాయి. కేటీఆర్, హరీష్‌ రావులే సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులను తమదైన శైలిలో మాటలతో ఎదుర్కొన్నారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగేసరికి దాదాపు చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

ప్రస్తుతం బీఆర్ఎస్‎కు ఎమ్మెల్యేల బలం కూడా తగ్గుతోంది. త్వరలో బీఆర్ఎస్సీఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెబుతున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో అన్నీతానై తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు అసెంబ్లీనే వేదిక చేసుకోనున్నారు కేసీఆర్ అని అంటున్నారు పార్టీ శ్రేణులు. మరి కేసీఆర్ రాకతో అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగుతాయో అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.

Read More నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి

Latest News

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ! ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!
హైదరాబాద్, డిసెంబర్ 02 : ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు...
రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!
డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...
ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్