Jayashankar Bupalapally I వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

Jayashankar Bupalapally I వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

నీటి సమస్య ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
బోర్లు, చేతి పంపులు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలి
తాగునీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు
మంచినీటి సరఫరాలో ఎండ్ టు ఎండ్ ప్లానింగ్ ఉండాలి
నీటి సమస్య ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు

జయశంకర్ భూపాపలల్లి :

Read More మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్యలు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి యుద్ధప్రాతిపదికన గ్రామాల జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న బోర్లు, చేతిపంపులను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీటిని వృథా చేయకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
గతేడాది నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పైప్ లైన్ లీకేజీల నివారణకు గ్రామస్థాయిలో నీటి సమస్యలపై పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓలు, ప్రత్యేక అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మించే ఇళ్లకు కొత్త పైపులైన్ వేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు.
గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ వాటర్‌ ట్యాంక్‌లను నెలకు మూడుసార్లు శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించాలన్నారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తితే ఎంపీడీఓలపై చర్యలు తీసుకుంటామని స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారి హెచ్చరించారు.

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

గ్రామాల్లో నూతనంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ సమయంలో మంచినీటి సరఫరా పైపులైన్లు పాడవకుండా ఆర్ డబ్ల్యూఎస్ కు ముందస్తు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని, మంచినీటి పైపులైన్ పగిలితే సంబంధిత శాఖ మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజు గ్రామాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఎంపీడీఓలకు వివరాలు తెలియజేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న మూడు నెలల పాటు మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవాలని అన్నారు. బోరు బావులు, ఇంట్రా పైప్‌లైన్ మరమ్మతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎవరి పర్యవేక్షణలో ఉన్న బోరు బావుల నిర్వహణ, విద్యుత్ వినియోగం తదితర అంశాలపై నివేదికలు అందజేయాలని పంచాయతీ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.వృథా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగం అయితే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

జిల్లాలోని అన్నాడి మండలాల్లోని బోరు బావులు, చేతిపంపులను మ్యాపింగ్ చేయాలని, మ్యాపింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, తద్వారా నీరు వృథా అయ్యే ప్రాంతాల్లో నీటిని ఆదా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మండల ప్రత్యేక అధికారులు మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ఈఈ నిర్మల, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు, మత్స్యశాఖ అధికారి అవినాష్, మండల ప్రత్యేకాధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రిడ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు