రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
జయభేరి,
ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. ఇంత పెద్ద స్కాం ను లైవ్ లో పట్టుకున్నామని అన్నారు. ఒక లారీ వెళ్లడానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. 32 టన్నులు మాత్రమే పోవాల్సిన లారీల్లో 70 నుంచి 100 టన్నుల వరకు తీసుకువెళ్తున్నారని అన్నారు.
అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక్కోలారికి 40 వేల వరకు ఉంటుందని, రోజుకు రెండు నుంచి మూడు వందల లారీలు వెళ్తే ఇందుకు సుమారు 50 లక్షలు వరకు అవుతుందని అన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని, ఇప్పటి వరకు 100 కోట్లు స్కామ్ చేశారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుంచి భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


