చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు

BRS పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి

27న జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేసి గెలిపించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి

చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు

జయభేరి, దేవరకొండ :
ఈనెల 27న జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలో వరంగల్ - నల్లగొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేసి గెలిపించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అద్యక్షులు, మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ లు కోరారు.

గురువారం దేవరకొండ పట్టణములో బిఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ... వరంగల్‌- ఖమ్మం-నల్లగొండ  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చీటర్‌ మల్లన్నను చిత్తుగా ఓడించాలని వారు పిలుపునిచ్చారు. మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు, సమస్యలపై పోరాడేతత్వం ఉన్న BRS పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. ఇన్నేళ్ళుగా ప్రశ్నించే గొంతుక అన్న కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మోసగించే గొంతుకగా మారాడని ఎద్దేవా చేశారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

ఓ యూట్యూబ్ ఛానల్ ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డ మల్లయ్య బాగోతం ఒక్కోక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ఇంకా ఆయన మీద ఉన్న కేసుల్లో అత్యధికంగా మహిళలు పెట్టినవే అన్నారు. వాటిని ఏదో ఉద్యమాల కేసులైనట్టు గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ దక్కడం కష్టమే అన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికి ప్రజల్లో మాత్రం లేనట్టే అన్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనపడి తరువాత అడ్రస్ కూడా లేకుండా పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయనేదో చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మాయమాటలు, నెరవేర్చలేని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్, బీజేపీ రెండు యువతను మోసగించిన పార్టీలే అన్నారు. ప్రస్తుతం యువతలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలయిందని.. ఈ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని అన్నారు. గతంలో దొడ్డు వడ్లు కొనాలన్న రేవంత్‌రెడ్డి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డు వడ్లు కాకుండా సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని చేతులు ఎత్తేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ బోగస్‌ మాటలు ప్రజలు ఎవరు నమ్మరాదని అన్నారు.

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని అమలు చేయకుండా మళ్లీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ముందు మరో మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం దొడ్డు వడ్లు కొనకపోయినా అప్పటి సీఎం కేసీఆర్‌ రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ(తడిసిన ధాన్యం) కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు అయిపోవడంతో ఇచ్చిన హామీలను మరిచి దాటవేస్తున్నారని విమర్శించారు. కేవలం 20 శాతం మేరకు సాగు అయ్యే సన్న ధాన్యానికి బోనస్‌ ఇచ్చి దొడ్డు వడ్లకు ఇవ్వమని అనడం అంటే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినట్లేనని వారు  ఆరోపించారు.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

రెండు నెలల నుంచి కళ్లాలలో ధాన్యం ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అబద్ధపు, మోస పూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఓడ మల్లన్న… ఎన్నికలు అయినంక బోడ మల్లన్న అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉందని వారు ఎద్దేవాచేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి,మండలాల అద్యక్షులు TVN రెడ్డి, రమావత్ దసృ నాయక్, దొంతము చంద్రశేఖర్ రెడ్డి, వేలుగురి వల్లపు రెడ్డి, లోకసని తిరుపతయ్య, రాజినేని వెంకటేశ్వర్ రావు,తదితరులు ఉన్నారు.

Read More మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం