సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్ పరిశ్రమ సహకారం
జయభేరి, డిసెంబర్ 4:
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో రాత్రి వేళల్లో నేరాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళనతో గ్రామానికి చెందిన నాయకులు గాదే వెంకటేష్, గురక కుమార్ యాదవ్, గోలిపల్లి ప్రభాకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, కంచికట్ల గోపాల్, గౌరారం శ్రీకాంత్, సత్యనారాయణ కలిసి స్థానికంగా ఉన్న ఎచ్ బి ల్ పరిశ్రమ యాజమాన్యంతో కలిసి మాట్లాడి సీసీ కెమెరాలకు గానూ 65000 రూపాయలు ఇప్పించారు. ఈ సందర్భంగా వారు హెచ్ బి ఎల్ పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలి
18 Jan 2025 13:02:11
జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పై ప్రశ్నించిన బిజెపి నాయకులపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ...
Post Comment