HARISH RAO FIRE : రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశాను
సీఎం రేవంత్‌కు చేరికల మీద ఉన్న దృష్టి... రైతు సమస్యలపై లేదు... మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
జయభేరి, హైదరాబాద్:
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న(ఆదివారం) దేవరుప్పుల మండలం లక్ష్మీభాయి తండాకు వెళ్లి అక్కడి రైతుల కళ్లల్లో నీళ్లు తిరిగారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న(ఆదివారం) దేవరుప్పుల మండలం లక్ష్మీభాయి తండాకు వెళ్లి అక్కడి రైతుల కళ్లల్లో నీళ్లు తిరిగారని అన్నారు. ఒక రైతు నాలుగు బోర్లు, మరో రైతు ఆరు బోర్లు వేసినా సఫలం కాలేదని రైతులు తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చేరికలపైనే దృష్టి సారించాయన్నారు. రైతుల కన్నీళ్లపై దృష్టి సారించాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరా రూ. 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు ఎన్నికల కోడ్ జోక్యం చేసుకోదని చెప్పారు. రూ. రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులు బ్యాంకు రుణాలు తీసుకోవద్దని సూచించారు. రైతులకు బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందన్నారు. రైతు రుణమాఫీ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ హెచ్చరించారు. రూ.500 బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని అనుసరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ధరణిలో తప్పులు ఎందుకు సరిచేయడం లేదు : పల్లా రాజేశ్వర్ రెడ్డి
బీఆర్ ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు రైతుల నుంచి విడివిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ధరణిలో తప్పులుంటే ఇప్పటి వరకు ఎందుకు సరిదిద్దలేదు? పట్టాలు కావాల్సిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. రైతులు వడ్డీలు చెల్లించవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
రేవంత్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు: దేశపతి శ్రీనివాస్
బీఆర్‌ఎస్ నేత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వాస్తవమేనని.. తెలంగాణ సెంటిమెంట్ కాదని అన్నారు. సెంటిమెంట్ ఉన్నవాళ్లను మెంటల్ అంటారని.. రేవంత్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని దేశపతి శ్రీనివాస్ అన్నారు.
Post Comment