Food : ఆహార పదార్థాలలో కల్తీని అరికట్టాలి
దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్
అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్ గురువారం ఉదయం హైదరాబాద్ కోటిలో రాష్ట్ర ఆహార కల్తీ నిరోధక శాఖ కార్యాలయంలో డిప్యూటీ కంట్రోలర్ విజయ కుమార్ కలిసి, ఆహార కల్తీ నిరోధానికి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు.
జయభేరి, బ్యూరో చీఫ్ వరంగల్ మే 22
ఆహార పదార్థాలలో కల్తీని అరికట్టాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్ అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ కోటిలో రాష్ట్ర ఆహార కల్తీ నిరోధక శాఖ కార్యాలయంలో డిప్యూటీ కంట్రోలర్ విజయ కుమార్ కలిసి, ఆహార కల్తీ నిరోధానికి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు.

24 గంటల వరకే నాణ్యతగా ఉండే పాలను, రెండు లేదా మూడు రోజులు వరకు పాలు నాణ్యతగా ఉండటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాలు కలపడం సర్వసా ధారణమైపోయిందని, పసుపు లో లెడ్ క్రోమేట్ కలప డం వల్ల క్యాన్సర్ వ్యాధులు విజృంభిస్తున్నాయని కాబట్టి వినియోగదారుల్లో ఆహార కల్తీ పట్ల చైతన్యం కూడా నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని వినియోగదారుల ప్రతినిధులు విన్నవించారు హైదరాబాద్ హోటల్స్ కల్తీ అరికట్టే భాద్యత ఉన్న ముని సిపల్ కార్పొరేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లను అప్రమత్తం చేయాలని, డిప్యూటీ కంట్రోలర్ ను కోరడం జరిగింది.


