ఎగ్లాస్పూర్ ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం

ఎగ్లాస్పూర్ ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం

జయభేరి, సైదాపూర్, జనవరి 23 : సైదాపూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా పాలన గ్రామసభ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆపీసర్ ముజాహిదీన్ హుస్సేన్ మండల్ ప్రత్యేక అధికారి జి భాగ్యలక్ష్మి మండల్ విస్తరణ అధికారి వైదేహి జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు కొత్త తిరుపతి రెడ్డి, ఎంఓ వంశీ జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీ ధర్ రెడ్డి, తాజామాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పేమ్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ చోట మియా దస్తగిరి క్రాంతి రమేష్, రవిందర్, రఘు, శ్రీ నివాస్, రాంరెడ్డి, మాజీ సర్పంచ్ చిక్కల సంపత్, కారోబార్ శ్రీ నివాస్, పిల్డ్ అసిస్టెంట్ స్వరూప, నిర్వహించిన కార్యక్రమంలో  ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు75, రైతుభరోసా0, ఇందిరమ్మ ఆత్మీయ పథకం14, రేషన్ కార్డుల108 పంపిణీతదితరకార్యక్రమాలను ఈనెల 24 వ తేదీ నుంచి అందించడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read More కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్

IMG-20250123-WA4342

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా 

ప్రజా పాలన, కుల గణన సర్వేలో భాగంగా సేకరించిన ఫిర్యాదులతో పాటు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించి గ్రామసభలో తెలియజేయడం జరిగిందని అన్నారు. ఇంకా అర్హులైన వారు ఉండి జాబితాలో పేరు లేనివారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని వివరించారు.

Read More మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని అర్హులైన వారందరికీ పంపిణీచేయడంజరుగుతుందని అన్నారు. ఇంటి స్థలాలు  ఉన్నవారికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామనాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి