దేవరకొండ మాజీ శాసనసభ్యులు విలేకరుల సమావేశం
జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు. జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ, పాల్గొన్నానున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్.
జయభేరి, నల్గొండ జిల్లా :
దేవరకొండ లో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ విలేకరు సమావేశం నిర్వహించినారు. విలేకరుల సమావేశంలో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ధి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు విజయవంతం చేయాలి.
జూన్ రెండవ తేదీన..తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ధి కాలం గడుస్తున్న నేపధ్యంలో… దశాబ్ది ముగింపు వేడుకల సభ ను హైదరాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం, హైదరాబాద్ లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నియోజకవర్గ కేంద్రాలలో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు.
3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు, ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథాశరణాలయాల్లో స్వీట్లు పండ్లు పంపిణీ. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మూర్ఖపు వైఖరి మానుకోవాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో గాజుల ఆంజనేయులు నీల రవికుమార్, బోయపల్లి శ్రీనివాస్, వేముల రాజు, గాజుల రాజేష్, తులసి రామ్ నాయక్, పొట్ట మధు, నాగరాజు, ఆంజనేయులు అభి తదితరులు పాల్గొన్నారు.


