Congress : రెండు లక్షల మెజారీటీ రావాలి...

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం.

Congress : రెండు లక్షల మెజారీటీ రావాలి...

జయభేరి, సికింద్రాబాద్ :
సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడారు. మంత్రి  కోమటిరెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం.సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివస్తామని కార్యకర్తలే చెప్తున్నారు. వారి ఉత్సాహం, ప్రజల స్పందన చూస్తుంటే తుక్కుగూడ సభ  పది లక్షలకు మించిపోయేలా ఉంది.ఈనెల 6న నిర్వహించే తుక్కుగూడ జనజాతర మహాసభకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి మ్యానిఫెస్టోని ఈ సభా వేదికగా పెద్దలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే విడుదల చేస్తారు. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం.. తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయడం, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోవడం. ఈ నెల 8న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తొలి సన్నాహక సమావేశం.. ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నాం పల్లి లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటుచేస్తున్నాం. అలాగే క్రమేనా 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటాం.. బూత్ కమీటిలు వేస్తాం. రెండు లక్షల మెజార్టీ తగ్గకుండా సికింద్రాబాద్ అభ్యర్ధిని గెలిపించుకోవడమే టార్గెట్ పెట్టుకున్నాం. నేను సమన్వయ కర్తను మాత్రమే, స్థానిక నాయకులందరు ఉన్నారు, గతంలో కూడ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు ఎంపీ గా ఉండటం జరిగింది, వారందరు కలిసి ఇప్పుడు మన నాగేందర్ గారిని కూడ గెలిపిస్తాం అని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనసులో పెట్టుకోకుండా కార్యకర్తలంతా కలిసిమెసిలి పనిచేయాలని కోరారు.

Read More Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

రాబోయే పదిసంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కార్యకర్తలందరు కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధిటని గెలిపించుకుందాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే అంతం అయిపోతుందంటే అర్థం అయిపోతుంది, పదేండ్లు పరిపాలన చేసిన కూడ కింది స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన నాయకులు వరకు వారి పార్టీ వీడుతున్రు అంటే వాళ్ళ కుటుంబ పాలనే కారణం.  దేశంలో ఏ పార్టీ కూడ ఇంతలా దిగజారి పోలేదు.. కార్యకర్తలతో కలిసి పనిచేసే పార్టీలు నిలదొక్కుకుంటాయి, కాంగ్రెస్ పార్టీ కూడ కార్యకర్తల పార్టీనే, పదేండ్లు అధికారంలో లేకున్నా కార్యకర్తల కృషివల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చినం.

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

వచ్చే ఎన్నికల్లో మన తెలంగాణ లో 13 నుండి 14 ఎంపీ సీట్లు గెలవడమే మా టార్గెట్, ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించాలి అని ప్రజలను నేను కోరుతున్నా. కిషన్ రెడ్డి   కేంద్రమంత్రి గా ఉండి, నాలుగు శాఖల మంత్రిగా సికింద్రాబాద్ ప్రజలకు ఆయన చేసిందేమిలేదు.ఈ రోజు వేల కోట్లతోటి నమామి గంగా అని మోడీ  గంగానదిని శుద్ధికరణ చేసుకున్నాడు. మన రాష్ట్రం నుండి టూరిజంశాఖ మంత్రిగా ఉండి కూడ కిషన్ రెడ్డి పార్లమెంటులో నేను మాట్లాడిన, కోట్ చేసిన మూసి నది గురించి ప్రస్థావన కూడ చేయలే. ఆయన ఎంతసేపు మతాల గర్షణలతో గెలుద్దామని అనుకుంటున్నురు, కాని ప్రతిసారీ అవి పనిచేయవు, ప్రజలు అమాయకులుకారని అన్నారు.

Read More Telangana I చెత్త మనుషులు

 పని చేసే నాయకుడు, కార్యకర్తల బలం ఉన్న సీనియర్ నాయకుడు, మళ్ళీ మా మాతృ పార్టీలోకి, సొంతపార్టీలోకి వచ్చిన సంధర్భంగా సంతోషంగా ఉన్నది. తప్పనిసరిగిగా గెలుస్తాం అన్న నమ్మకం ఉన్నది. మంచి మెజార్టీ తో గెలుస్తాం. హైదరబాద్ ప్రజలందరికి తెలుసు మన ముఖ్యమంత్రి గారు మెదటి నుండి ఎక్కడ ప్రస్తావన వచ్చిన ఫస్ట్ మూసీ నది గురించే మాట్లాడుతున్నారు. నిజాం కాలంలో సాగునీరు, త్రాగునీటి అవసారాలు తీర్చేన  మూసీ నది. కానీ డ్రైనేజిని వదిలిపెట్టడం ద్వారా అది మురికి కూపంగా మారింది. గత కేసిఆర్ ప్రభుత్వం దానిని ఏనాడు పట్టించుకోలే..ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జి కట్టి మొత్తం హైదరాబాద్ డెవెలప్ చేసిన అన్నారు. మన ముఖ్యమంత్రి గారి చోరవతో మూసి నదిని 40 నుండి 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం, ఇప్పటికే బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతుంది. డీపిఆర్ లు కూడ సిద్దం అయ్యాయి. హైద్రాబాద్ ని అభివృద్ధి చేయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రొడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కట్టింది. అండ్ బీ శాఖ మంత్రిగా నేను ప్రయత్నం చేసిన నేషనల్ హైవే “రీజినల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్” గా  కాబోతున్నది త్వరలోనే దానికి కూడ శంకుస్ధాపన చేసుకోబోతున్నమని అన్నారు.

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

నాగేందర్ లాంటి సీనియర్ నాయుకులు గెలిపిస్తే, రాష్ట్రంలో కూడ మన పార్టీనే ఉంది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, అభివృద్ది కి మేలు జరుగుతుంది కాబట్టి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి నాగెందర్ గారిని గెలిపించాలని మరొకసారీ కోరుకుంటున్నా. కేసిఆర్ కుటుంబం రాజకీయాలు మానేసి ప్రజలకు క్షమాపణ చెప్పి.. కుటుంబాన్ని చూసుకొని బ్రతకాల్సిందే.. దేవుడి పేరుతో కట్టిన కాళేశ్వరంలో అవినీతి, దేవునిగుడి కట్టిన యాదగిరిగుట్టలో అవినీతి.. మహిళ లిక్కర్ వ్యాపారం చేయడం, కొడుకు మంది ఫోన్లు వినే ట్యాపింగ్ చర్యలకు పాల్పడటాన్ని దేవుడు కూడా తట్టుకోలేదు. అందుకే గత వర్షాకాలం తగినంత వర్షాలు పడలేదు. కేసిఆర్ ప్రభుత్వంలో వర్షాకాలం వస్తే.. దాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నడు. కానీ ప్రజలు విజ్ఞులు.. అన్నింటిని ఆలోచించగలరు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి పూర్తిగా కనుమరుగు అవుతుంది. కేటీఆర్.. కల్వకుంట్ల ట్యాపింగ్ రావు గా మారిపోయిండు. కేసిఆర్ ప్రభుత్వంలో ఎక్కడా చూసినా.. అరాచకాలే జరిగినయి.   నాలుగు కోట్ల మంది ప్రజల్ని ముంచు నలుగురు కుటుంబ సభ్యులు బాగుపడ్డరని అన్నారు.

Read More Congress I వ్యవస్థీకృత విధ్వంసం ప్రజా పాలన కొనసాగేదెలా...!?

Views: 0