రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ధర్నా

అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది - మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి... రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది

రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ధర్నా

జయభేరి, మే 16:
రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వారి  జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతుందని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండ ఇబ్బందులకు గురి చేస్తోందని మాజి మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. గురువారం శామీర్ పేట్ లో మాజి సిఎం కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగావులు కాస్తున్నారని, కొనుగోలు చేసిన దాన్యానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం లేదని మండి పడ్డారు. రైతులు పండించిన పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. రైతుభరోసా, పంట నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.

e46f4a93-6c5c-4284-9e57-32f8dad3b259

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు తాండవిస్తుందని, కరెంట్ కోతలు, సాగునీరు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన చెందారు. దేవుళ్లపైన ఒట్టువేసి ఆగష్టులో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మెనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలు కూడ ఒట్టేసి ఎప్పుడు అమలుపరుస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెరువులు నీటితో కళకళలాడుతుండేవని సాగునీటికి, తాగునీటికి, మత్య్సకారులు చేపల పెంపకానికి డోకా ఉండేది కాదని గుర్తు చేశారు. కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కుంగితే పెద్ద రాద్దాంతం చేస్తున్నారని పక్క నుంచి నీటి విడుదల చేయడం చేతకావడం లేదని, కేసిఆర్ను బద్నాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ను బాగుచేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే కరువు వచ్చిందని ఎద్దెవ చేశారు. మహిళలకు రూ.2500, ఎకరానికి రూ.15 వేలు రైతుభరోసా, కల్యాణలక్ష్మి తులం బంగారం, రైతులకు బోనన్ ఎప్పుడు ఇస్తారని మీరు చెప్పిన హామీలను మాత్రమే అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాణ పోరాటాలు చేస్తుందని హామీలన్ని అమలయ్యేదాక నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అనితలాలయ్య, ఎంపీపీ ఎల్లుబాయి బాబు, జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య,తాళ్ల జగదీష్ గౌడ్,వంగ వెంకట్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.