గుండ్లపోచంపల్లిలో జోరుగా బీజేపీ ప్రచారం

14 వార్డులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి

గుండ్లపోచంపల్లిలో జోరుగా బీజేపీ ప్రచారం

మేడ్చల్ :

ప్రధాని మోదీ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి అన్నారు. శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని 14వ వార్డులో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే పార్టీలను నమ్మవద్దన్నారు. దేశంలో గత దశాబ్ద కాలంగా ఒక్క అవినీతి లేకుండా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న నరేంద్రమోదీ పాలనను చూసి మరోసారి బీజేపీ కి అవకాశం ఇవ్వాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి దేశ అభివృద్ధికి మద్దతుగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప నేత ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడు ఈటల రాజేందర్ అని అలాంటి నాయకుడు ఎంపీగా గెలిస్తే మల్కాజిగిరి ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Read More ఘనంగా డాక్టర్ వేణుధ రెడ్డి జన్మదిన వేడుకలు

33cad259-6523-463e-acc6-954d5e2b1a64

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం 

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ (సెన్సార్ బోర్డ్ మెంబర్) అమరం సరస్వతి, కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, సార కిషన్, చెంచల సురేష్, బిజెపి జనరల్ సెక్రెటరీ అశోక్, కృష్ణా, బీజేవైఎం అధికార ప్రతినిధి కావేరి శ్రీధర్, ప్రెసిడెంట్ బట్టికాడి విక్రమ్, జనరల్ సెక్రెటరీ సుంకు నవీన్, శ్రీకాంత్, అనిల్, వినయ్, మహిళా మోర్చా ప్రెసిడెంట్ బట్టికాడి నవనీత, నరేందర్, కృష్ణంరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు