మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం...

దేశంలో రోజు రోజుకి మోడీ కి క్రేజ్ లభిస్తుంది - నేషనల్ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్... మల్కాజిగిరి  ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వండి - మల్కాజ్ గిరి భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్

మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం...

జయభేరి, తుంకుంట :

మున్నూరు కాపు కులస్థలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి  అభ్యర్థిఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంటలోని రామకృష్ణారెడ్డి ఫంక్షన్ హాలులో మున్నూరుకాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ది శ్రీనివాస్  ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపి, నేషనల్ ఓబీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్  ఓబిసి చైర్మన్ డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోదీ ప్రధాని అయిన తర్వాత భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అణగారిన బిసి వర్గాలకు పెద్దపేట వేసిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. రాజకీయాల్లో మున్నూరుకాపులు క్రీయశీలకంగా వ్యవహరిస్తున్నారని, అంతేకాక మెజార్టీ ఎంపి సభ్యులు మున్నూరుకావులే ఉన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను  భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.

Read More నాయిదొరా జానపద నృత్య షూటింగ్ ప్రారంభం

eat1p

Read More పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తం సీఆర్పీఎఫ్

అనంతరం ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రెండుసార్లు దేశ ప్రధానిగా మూడుసార్లు గుజరాత్ సిఎంగా రాష్ట్రాన్ని పాలించి అవినీతి, మచ్చ లేకుండా అభివృద్ధి చేసి చూపించిన నరేంద్రమోదీ గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అమెరికా లాంటి దేశాలు సైతం భారతదేశాన్ని చిన్నచూపు చూసేవారని మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచం చూపు భారతదేశంపై పడిందని అన్నారు. మోదీ ప్రధానిగా మూడవసారి గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవించాలంటే మోదీ లాంటి ప్రధాని ఉండాలని అన్నారు. రామజన్మ భూమిలో రాముడి మందిర నిర్మాణం చేసిన గొప్ప మహానీయుడని అన్నారు. కాగా మల్కాజిగిరి అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని తనను అత్యధిక మెజార్టితో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మేడ్చల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటెలను పలువురు నాయకులు శాలువాలతో ఘనంగా  సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంతం దీపిక, మాజి జడ్పిటిసి సింగం సత్తయ్య. అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబు. నందనం దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్

eat2p

Read More ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు