Pm modi I ప్ర‌ధాని మోడీ రాజీనామా..

ఈ రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. ఆప‌ద‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి (Pm modi) మోడీని కోరారు. ఏన్డీయే కూట‌మికి 293 సీట్లు ఉండ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ద‌మ‌వుతోంది. జూన్ 8న మూడో సారి ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం.

Pm modi I ప్ర‌ధాని మోడీ రాజీనామా..

ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి న‌రేంద్ర మోడీ రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తిని క‌లిసి త‌న రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. ఆప‌ద‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి (Pm modi) మోడీని కోరారు. జూన్ 4 న వెలువ‌డిన లోక్‌స‌భ ఫ‌లితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూట‌మి మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. 

ఈ మేర‌కు (NDA) ఎన్డీయే కూట‌మిలోని నేత‌లు నితీశ్‌కుమార్‌, చంద్ర‌బాబు (Chandrababu), ప‌వ‌న్‌క‌ల్యాణ్ తేజస్వీ యాద‌వ్‌లు ఢిల్లీ వెళ్లారు. ఏన్డీయే కూట‌మికి 293 సీట్లు ఉండ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ద‌మ‌వుతోంది. జూన్ 8న మూడో సారి ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం. అందుకోసం (Delhi) ఢిల్లీలోని క‌ర్త‌వ్య‌ప‌థ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 7న ఎన్డీఏ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌ను ఎన్నుకోనున్నారు.

Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు

Social Links

Related Posts

Post Comment