కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్

12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడి

ఈ  రాష్ట్రంలో 1,977 కేసులు ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కట్టడికి ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్

జయభేరి, తిరువనంతపురం, మే 16:
కేరళలో లో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తుంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. 12మంది ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ  రాష్ట్రంలో 1,977 కేసులు ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కట్టడికి ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.

వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులను క్లోరినేషన్ చేస్తామని, రెస్టారెంట్లకు ఉడికించిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని చెప్పినట్లు ఆమె తెలిపారుహెపటైటిస్ ఎ వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఇది నీటి ద్వారా లేదా కలుషితమైన ఆహారం, అంటువ్యాధి కలిగిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో మరో 5,536 అనుమానిత కేసులు ఈ సంవత్సరం నమోదైనట్లు తెలు్తోంది. ఈ వైరస్ కారణంగా మరో 15 మంది మరనించినట్లు అనుమానిస్తున్నారు.

Read More HOUSE PRICES : ఇళ్ల ధరలు పడిపోతున్నాయి

Views: 0

Related Posts