దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అసభ్యకర వీడియోలపై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

  • దేవెగౌడ కొడుకు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్
  • ప్రజ్వల్ దగ్గర డబ్బు, పలుకుబడి ఉందని పూనమ్ కౌర్ అంటోంది
  • ఈ ప్రభుత్వం తనకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అసభ్యకర వీడియోలపై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

సినీ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏ విషయంపైనైనా ఆమె తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా వ్యక్తపరుస్తుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుమారుడు) అసభ్యకర వీడియోల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలియగానే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ఆయన జర్మనీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

Untitled-design-42-2024-04-8ebcda235d39d184f74f8a32a2ece437-3x2

Read More Arvind Kejriwal : కేజ్రీవాల్ అరెస్టుపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు

దేవెగౌడ పార్టీ జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల వ్యవహారం కూటమిపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రేవణ్ణ జర్మనీకి పారిపోయారని ఆమె అన్నారు. తనకు ఎంతో డబ్బు, పలుకుబడి ఉందని...అందుకే ఈ ప్రభుత్వం తనకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే క్షేమంగా జర్మనీ వెళ్లినట్లు తెలిపారు.

Read More MS Dhoni new cycle : ధోనీ కొన్న కొత్త ఈ-సైకిల్​ ఇదే.. దీని ధర తెలిస్తే షాక్!

Views: 0

Related Posts