దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్

దొంగిలించబడిన 10,97,600 విలువ గల బంగారు వెండి ఆభరణాలు పూర్తి సొత్తు రికవరీ చేసి భరోసా కల్పించిన పోలీసులు

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్

జయభేరి, రామగుండం : 

మంగళవారం అర్ధరాత్రి  సల్పల శ్రీనివాస్ s/o లేట్ లింగయ్య, వయస్సు 45 సంవత్సరాలు, కులం గొల్ల Occ కూలీ, వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన వ్యక్తి తన ఇంట్లోకి చొరబడి దొంగతనం కు పాల్పడినాడు అని అనుమానం కలదు.

Read More నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు

అభి ఫిర్యాదుదారు నెందుగూరి రామన్న s/o కిష్టయ్య, వయస్సు 60 సంవత్సరాలు, కులం బారే Occ అగ్రిల్, r/o. కేతనపల్లి గ్రామంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పిర్యాదు ప్రకారం క్రైమ్ నెంబర్ 35/2024, U/S. 457, 380, 75 IPC సెక్షన్ ల తో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు లో భాగంగా వెంటనే SI ఆఫ్ పోలీస్, నీల్వాయి, CI ఆఫ్ పోలీస్, చెన్నూర్ రూరల్ పరిసర ప్రాంతాలలో టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. నిందితుని కోసం వెతుకుతుండగా బుధవారం అంటే తేది 28-05-2024. మల్లంపేట గ్రామ ప్రారంభం వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో అనుమానస్పదంగా కనిపించిన నిందితుడు సల్పల శ్రీనివాస్ ను పట్టుకోవడం జరిగింది. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలు, నికర నగదు రూ.  2,62,600/- ను స్వాధీనం చేసుకొని అతన్ని పిఎస్‌కి తీసుకువచ్చి అరెస్ట్ మెమో జారీ చేయడం ద్వారా అతని అరెస్టును చేసి గౌరవ కోర్ట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది అని సీపీ గారు తెలిపారు.

Read More అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

IMG-20240529-WA1561

Read More Hyd : హైదరాబాద్ నడిబొడ్డున హత్యాచారం!

నిందితుడు సల్పల శ్రీనివాస్ పై గతంలో కూడా వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆస్తి అక్రమాలకు పాల్పడిన కేసులు నమోదు కాబడినవి..  నిందితుని వివరాలు... 

Read More హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు

సల్పల శ్రీనివాస్ s/o లేట్ లింగయ్య, వయస్సు 45 సంవత్సరాలు, కులం గొల్ల Occ కూలీ, వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామమం... నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు...

Read More ఆలయంలో చోరీ

రెండు బంగారు నెక్లెస్‌లు. ఒక్కదాని బరువు 1 ½ తులా.... మొత్తం 3 తులాలు, 3 బంగారు గొలుసులు, ఒక్కొక్క దాని బరువు 3 తులాలు..... మొత్తం 9 తులాలు, 2 బంగారు మాటీలు బరువు ¼ తులా.. 2 ఇయర్ రింగ్స్ బరువు. ¼ తులా, ఒక బంగారు ఉంగరం. 0.75 గ్రా. రెండు బంగారు ఉంగరాలు. 1.5 గ్రాములు, 2 వెండి కాళ్ళ పట్టిలు...6 తులాలు, రూ.  2,62,600/- నగదు, మొత్తం విలువ 10,97,600/-.

Read More Crime news : రెండు రోజుల పాటు గ్యాంగ్​ రేప్​!

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు శాఖ ప్రజలతో ఏర్పరచుకున్న సత్సంబంధాల వలన మండలంలోని యువకులు సోషల్ మీడియాలో నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేసినందున నిందితుని సమాచారం పోలీసులకు తెలిసింది తధానుగుణంగా పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది ఈ సందర్భంగా ప్రజలను అభినందిస్తున్నాము మరియు నిందితులను పట్టుకొనడంలో చాకచక్యంగా వ్యవహరించిన చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది ని అభినందించడమైనది.

Read More Nagole Murder I నాగోల్ హత్య మిస్టరీ, ముగ్గురు నిందితుల అరెస్ట్

Social Links

Related Posts

Post Comment