Car Accident : హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ ఎక్స్ రోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.

Car Accident : హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు

హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ ఎక్స్ రోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More ఆలయంలో చోరీ

Views: 0

Related Posts